News January 31, 2025
రాష్ట్రంలో GBS తొలి కేసు నమోదు

మహారాష్ట్రలో విజృంభిస్తున్న <<15225307>>గిలియన్ బార్ సిండ్రోమ్<<>> (GBS) తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలో ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె HYD కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది అంటువ్యాధి కాదని, నయం చేయవచ్చని తెలిపారు.
Similar News
News February 18, 2025
సిగ్గు సిగ్గు.. సీఎంకు ఇంత అభద్రతా భావమా?: KTR

TG: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన KCR పుట్టినరోజున విద్యార్థులకు స్వీట్లు పంచడం తప్పా అని KTR ప్రశ్నించారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ స్కూల్ HMను సస్పెండ్ చేస్తారా అని ఫైరయ్యారు. వార్డు మెంబర్ కాని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టడం, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చా అని నిలదీశారు. సిగ్గు సిగ్గు.. CMకు ఇంత అభద్రతా భావమా అని దుయ్యబట్టారు.
News February 18, 2025
మార్చి 28నే ‘హరిహర వీరమల్లు’: నిర్మాత

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీని మార్చి 28నే రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చిత్రం నుంచి ఈ నెల 24న రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
News February 18, 2025
ప్రజాస్వామ్యంపై జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది: లోకేశ్

AP: అధికారం ఉన్నప్పుడు చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది మంది కళ్లారా చూశారని చెప్పారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో జగన్ PhD చేసినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు జగన్ బ్రాండ్ అని ఫైరయ్యారు.