News June 14, 2024
తొలి CNG బైక్ ఆవిష్కరణ వాయిదా
ప్రపంచంలోనే తొలి CNG బైక్(బ్రూజర్ 125) ఆవిష్కరణను జులై 17కు వాయిదా వేస్తున్నట్లు బజాజ్ ఆటో వెల్లడించింది. ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు గతంలో తెలపగా, ఇప్పుడు అనివార్య కారణాలతో వాయిదా వేసింది. కాగా CNG వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కేంద్రాన్ని తాజాగా కోరింది. దీనిపై భారీ పరిశ్రమల శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Similar News
News September 19, 2024
మోదీనే నం.1
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిచూపుతారు. ఈ ఏడాది Xలో జనవరి – ఆగస్టు వరకు అత్యధిక మంది మాట్లాడుకున్న వ్యక్తిగా మోదీ నిలిచారు. ఆయన తర్వాత విరాట్ కోహ్లీ(2), రోహిత్ (3), విజయ్ (4), యోగీ ఆధిత్యనాథ్ (5), రాహుల్ గాంధీ (6), ధోనీ (7), షారుఖ్ ఖాన్(8), పవన్ కళ్యాణ్ (9), ఎన్టీఆర్ (10) ఉన్నారు.
News September 19, 2024
చరణ్- బుచ్చిబాబు.. మరో ‘రంగస్థలం’ కానుందా?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ కథను బుచ్చిబాబు నాలుగేళ్ల పాటు రాశారు. త్వరలో మూవీ స్టార్ట్ చేయనుండటంతో మూవీ కాస్ట్‌ను డైరెక్టర్ సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా టీమ్‌లోకి ‘తంగలాన్’ డ్రెస్ డిజైనర్ ఏకాంబరంను తీసుకున్నారు. ఈయనను తీసుకున్నారంటే ‘రంగస్థలం’లాంటి నేటివ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 19, 2024
ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.