News August 4, 2024
సెయింట్ లూసియాకు తొలి ఒలింపిక్ మెడల్
ఒలింపిక్స్ చరిత్రలోనే సెయింట్ లూసియా తొలి పతకం దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆ దేశ రన్నర్ జూలియన్ ఆల్ఫ్రెడ్ 100 మీ. పరుగు పందెంలో పతకం సాధించారు. 10.72 సెకన్లలో రేస్ పూర్తి చేసి ఆమె గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు. దీంతో ఆ దేశ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News September 9, 2024
BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.
News September 9, 2024
సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్‌కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.
News September 9, 2024
‘మేనన్’ నా ఇంటి పేరు కాదు: హీరోయిన్ నిత్య
విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్‌పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని చెప్పుకొచ్చారు.