News November 13, 2024

నేడు ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

Similar News

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.

News April 17, 2026

ఇండియాకు వాంటెడ్ టెర్రరిస్టులు.. పాక్‌లో హతం!

image

లష్కరే తోయిబా(LeT) కో ఫౌండర్ అమీర్ హమ్జాపై పాక్‌లో <<19664047>>కాల్పులు<<>> జరగడం తెలిసిందే. మూడేళ్లుగా LeT, జైషే(JeM), హిజ్బుల్(HM)లోని వాంటెడ్ టెర్రరిస్టులు ‘గుర్తుతెలియని వ్యక్తుల’ కాల్పుల్లో హతమవుతున్నారు. మహ్మద్ తాహిర్ అన్వర్(JeM చీఫ్ మసూద్ అజర్ అన్న), LeT టెర్రరిస్టు అబు ఖతల్(హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు), ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌తో సహా ఎంతో మందిని పాక్‌లో మట్టుబెట్టారు.