News April 23, 2025

ఉగ్రవాది తొలి ఫొటో

image

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫొటోను జాతీయ మీడియా బయటపెట్టింది. రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు. ఈ దాడిలో 8-10 మంది పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5-7 మంది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి.

Similar News

News April 19, 2026

మరో ఏడాదిపాటు చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్!

image

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. 2027 జూన్ వరకు ఎక్స్‌టెండ్ చేయనున్నట్లు పేర్కొంది. 2023లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాత భారత్ 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ఆయనే కారణమని విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

అనిల్ రావిపూడి సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్?

image

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమా కోసం తొలిసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కించబోయే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అనిల్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. అవి సూపర్ హిట్టయినా మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చడం ఆసక్తికరంగా మారింది.