News June 11, 2024
ఈనెల 15న ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ‘సరిపోదా శనివారం’ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గరం గరం’ సాంగ్‌ను ఈనెల 15న శనివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ కానుంది.
Similar News
News December 31, 2025
2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన టాప్-5 తీర్పులు!

* పార్టీ ఫిరాయింపు MLAలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు మాత్రమే.
* సర్వీస్‌లో ఉన్న టీచర్లకు TET తప్పనిసరి. 5ఏళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు. మైనారిటీ ఇనిస్టిట్యూట్స్‌కు వర్తించవు.
* రాజ్యాంగబద్ధ కోర్టులకు జీవితఖైదు వేసే పవర్. లైఫ్ వేసే/శిక్ష తగ్గించే అధికారం సెషన్స్ కోర్టులకు లేదు.
* అన్ని రాష్ట్రాల్లో SIR కొనసాగించాల్సిందే.
* బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్‌కు కాలపరిమితి లేదు.
News December 31, 2025
‘వన్ పేజ్’ క్యాలెండర్: ఒకే పేజీలో 365 రోజులు

క్యాలెండర్‌లో ప్రతి నెలా పేజీలు తిప్పే శ్రమ లేకుండా ఏడాది మొత్తాన్ని ఒకేచోట చూస్తే ఎంత బాగుంటుంది? అదే ఈ ‘వన్ పేజ్ క్యాలెండర్’ ప్రత్యేకత. ఇందులో ఏ రోజున ఏ వారం వస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎడమవైపున్న డేట్స్‌తో కుడివైపున్న నెలలు-వారాలను సరిచూసుకుంటే చాలు. ఆఫీస్ టేబుల్స్ లేదా ఇంటి గోడలపై దీనిని ఏర్పాటు చేసుకోండి. ఈ వినూత్న క్యాలెండర్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేసి 2026కి వెల్కమ్ చెప్పండి.
News December 31, 2025
Stock Market: లాభాలతో వీడ్కోలు.. ఏడాదిలో 10% జంప్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025కు భారీ లాభాలతో వీడ్కోలు పలికాయి. నిఫ్టీ 190 పాయింట్లు పెరిగి 26,129 వద్ద.. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద ముగిసింది. సెన్సెక్స్30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. మొత్తంగా 2025లో నిఫ్టీ 10.5%, సెన్సెక్స్ 9.06% పెరగడం విశేషం. మన సూచీలు వరుసగా పదో ఏడాది వృద్ధిని నమోదు చేశాయి.


