News June 11, 2024

ఈనెల 15న ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్

image

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న ‘సరిపోదా శనివారం’ నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గరం గరం’ సాంగ్‌ను ఈనెల 15న శనివారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నాని కనిపించనున్నారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ కానుంది.

Similar News

News March 20, 2025

రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

image

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

News March 20, 2025

నా టెంపర్‌మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

image

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్‌మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్‌మెంట్‌లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్‌మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.

News March 20, 2025

ఆర్మీలోకి రూ.7వేల కోట్ల విలువైన ATAGS.. కేంద్రం ఆమోదం

image

భారత ఆర్మీ మరింత శక్తిమంతం కానుంది. రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం కొనుగోలు చేయనుంది. వీటికి 48 కి.మీ పరిధి ఉంటుంది. ట్రక్కులపై తరలించే మౌంటెడ్ గన్ సిస్టమ్స్‌ తరహాలో వీటిని తయారుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!