News April 25, 2024

మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్

image

హాట్ హాట్ సమ్మర్‌ను కూల్ కూల్ సాంగ్స్‌తో హోరెత్తించేందుకు స్టార్ హీరోలు సిద్ధమయ్యారు. ఈ వేసవిలో బడా చిత్రాలు విడుదలకు నోచుకోకపోవడంతో పలు చిత్రాల నుంచి ఫస్ట్ సింగిల్స్ రానున్నాయి. ఈ జాబితాలో పుష్ప-2(మే 1), డబుల్ ఇస్మార్ట్(మే 15), కల్కి(మేలోనే), దేవర(మే 20) ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి వచ్చిన అప్డేట్లతో సినిమాలపై క్రేజ్ అమాంతం పెరిగింది.

Similar News

News April 19, 2026

SRH బ్యాక్ బోన్.. కన్సిస్టెంట్ క్లాసెన్

image

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్‌ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.

News April 19, 2026

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

image

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టిన‌రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News April 19, 2026

CUET UG-2026.. మరొకొన్ని గంటలే ఛాన్స్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG-2026) సబ్జెక్ట్ కరెక్షన్ విండో నేటితో ముగియనుంది. CUET, <>NTA<<>> సైట్లలో ఈరోజు రా.11.50 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉండదని NTA స్పష్టం చేసింది. సెంట్రల్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మే 11 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి.