News January 22, 2025
నేడే ఇంగ్లండ్‌తో తొలి T20.. కళ్లన్నీ షమీపైనే

స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5T20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్ తొలి T20 కోల్‌కతాలో ఆడనుంది. SKY సారథ్యంలో ధనాధన్ ఆటకు జట్టు సిద్ధమైన వేళ స్టార్ పేసర్ షమీపైనే కళ్లన్నీ ఉన్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులో చేరిన షమీ ఆశించిన స్థాయిలో రాణిస్తే CTలో భారత్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారనున్నారు. అటు విజయంతో సిరీస్ ప్రారంభించాలని ఇంగ్లండ్ వ్యూహాలు రచిస్తోంది. రాత్రి 7 గం.కు స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ లైవ్ చూడవచ్చు.
Similar News
News February 14, 2025
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
News February 14, 2025
మున్షీ స్థానంలో మీనాక్షి

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
News February 14, 2025
వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.