News April 30, 2024
ఐదేళ్లు జగన్ గుడ్డి గుర్రాల పళ్లు తోమారా?: షర్మిల

AP: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ చీఫ్ షర్మిల అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆమె మాట్లాడారు. రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లు పాలించిన జగన్ గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయన్నారు. నాసిరకం మద్యంతో 25 శాతం మంది చనిపోతున్నారని చెప్పారు.
Similar News
News April 14, 2026
చల్లదనం కోసం బీర్లు తాగుతున్నారా?

వేసవిలో బీర్లు తాగితే శరీరం కూల్ అవుతుందనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా తాగితే మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని నీరు అధికమొత్తంలో బయటకు వెళ్లిపోతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, కాలేయ, జీర్ణ సమస్యలు, నిద్ర పట్టకపోవడం, రక్తపోటు సమస్యలు వస్తాయంటున్నారు.
#ShareIt
News April 14, 2026
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.
News April 14, 2026
నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.


