News March 20, 2024

ఆరు స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్?

image

TG:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న 13 స్థానాల్లో ఆరింటిపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. పెద్దపల్లి-గడ్డం వంశీ, చేవెళ్ల-రంజిత్‌రెడ్డి, మల్కాజ్‌గిరి-సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్-మల్లు రవి, ఆదిలాబాద్-ఆత్రం సుగుణ, సికింద్రాబాద్- దానం పేర్లు ఫిక్సయినట్లు సమాచారం. అటు భువనగిరి, KMM, WGL, HYD, MDK, NZB, KMR స్థానాలు ఖరారు చేయాల్సి ఉంది.

Similar News

News April 18, 2026

మహిళా బిల్లును ప్రవేశపెట్టిన DMK

image

డీలిమిటేషన్‌కు లింక్ చేసి ప్రవేశపెట్టిన మహిళా బిల్లు నిన్న వీగిపోయిన నేపథ్యంలో NDAకు కౌంటర్‌గా రాజ్యసభలో DMK ఈరోజు ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్, సెన్సస్‌ అవసరం లేకుండా 543 లోక్‌సభ స్థానాల్లోనే 33% మహిళలకు కేటాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలు, UTలైన పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ సహా ఢిల్లీ NCRకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. సీట్లను, నియోజకవర్గ పరిధులను మార్చాల్సిన అవసరం లేదంది.

News April 18, 2026

రోజుకు 8 గంటలు కష్టపడుతున్న రష్మిక

image

రవీంద్ర పుల్లే డైరెక్షన్‌లో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న ఆమె యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. రోజుకు 8 గంటలపాటు స్టంట్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ట్రైనింగ్(ఆర్మీ తరహా శిక్షణ) తీసుకుంటున్నారు. త్వరలో కేరళంలో 16 రోజుల పాటు యాక్షన్ షెడ్యూల్‌కు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

News April 18, 2026

మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

image

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.