News December 5, 2024

FLASH: జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్

image

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్‌కు వెళ్తుండగా హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆయన కారు దాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో రాంప్రసాద్‌ కారును వెనక నుంచి ఓ ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

Similar News

News January 26, 2025

ఆ ప్రచారం నమ్మొద్దు.. ‘RC 16’ టీమ్

image

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో ‘RC 16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఆస్కార్ విన్నర్ AR రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన టీమ్ ఇందులో వాస్తవం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అభిమానులకు సూచించింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

News January 26, 2025

నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్‌లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

News January 26, 2025

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా: బాలకృష్ణ

image

తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు. NTR వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను. నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.