News June 7, 2024

FLASH: పార్లమెంట్ దగ్గర కలకలం

image

పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్‌ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత డిసెంబర్‌లో సైతం దుండగులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది.

Similar News

News December 10, 2024

నేటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు

image

TG: తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నేడు సమ్మెలోకి దిగనున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని గతేడాది CM రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని తెలిపారు. 20 ఏళ్లుగా తక్కువ జీతాలకు పని చేస్తున్నామని వాపోతున్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెతో KGBVలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉంది.

News December 10, 2024

ట్రంప్ జట్టులోకి మరో భారత సంతతి వ్యక్తి

image

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లోకి భారత సంతతి మహిళను ఎంపిక చేశారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఇండో అమెరికన్ లాయర్ హర్మిత్ థిల్లాన్‌ను మానవ హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్ పోస్టుకు నామినేట్ చేశారు. ఇప్పటికే ఆయన తన కార్యవర్గంలోకి భారత మూలాలున్న వివేక్ రామస్వామి, కోల్‌కతాలో జన్మించిన భట్టాచార్య, కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

News December 10, 2024

ఏలూరు ఘటనపై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం

image

AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో ఇంటర్ బాలిక ప్రసవం, <<14828392>>బిడ్డను విసిరేయడంపై<<>> రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మండిపడింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, పేరెంట్స్ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందంది.