News December 7, 2024

FLASH: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు

image

TG: మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది. కౌకుంట్ల మండలం దాసరపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల గోదావరి బెల్ట్ మొత్తం భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది.

Similar News

News January 20, 2025

చంద్రబాబు హయాంలో ఒక్క అప్పడాల మెషిన్ కూడా రాలేదు: YCP

image

చంద్రబాబు గెలిస్తే చాలు దావోస్ వెళ్లి పెట్టుబడులంటూ బిల్డప్ ఇస్తారని YCP విమర్శించింది. ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ దావోస్ వెళ్లి ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవడం తప్ప ఇన్నేళ్లలో ఒక్క అటుకుల మిల్లు, అప్పడాల మెషిన్ కూడా రాలేదు. తండ్రీకొడుకులు ప్రజా ధనంతో షికార్లు చేసి వస్తారు. జగన్ తన హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ వెళ్లారు. అప్పుడు రూ.1,26,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి’ అని ట్వీట్ చేసింది.

News January 20, 2025

బీఆర్ఎస్ రైతు మహాధర్నా వాయిదా

image

రేపు నల్గొండలో BRS చేపట్టాల్సిన మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు, విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ఈనెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు.

News January 20, 2025

ఈ సమయంలో బయటకు రాకండి: డాక్టర్లు

image

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్నం ఎండ, వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం, రాత్రి విపరీతమైన చలి ఉంటోంది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా 18 డిగ్రీల వరకు ఉంటోంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి.