News November 25, 2024
FLASH: భారీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వారం రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా రూ.1,090 తగ్గడంతో రూ.78,550కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,000 తగ్గి రూ.72,000 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.500 తగ్గి రూ.1,00,500కు చేరింది.
Similar News
News December 5, 2024
రైల్వే ప్రయాణికులకు తీపి వార్త
ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.
News December 5, 2024
ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
AP: రాష్ట్రవ్యాప్తంగా 53 నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆమోదం తెలిపారు. 37 మండలాల్లో 47, రెండు పట్టణ ప్రాంతాల్లో 6 కాలేజీలను ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 480 జూనియర్ కాలేజీలున్నాయి.
News December 5, 2024
‘మేకిన్ ఇండియా’పై పుతిన్ ప్రశంసలు
చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్‌లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్‌లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.