News October 29, 2024

FLASH: మూడో టెస్టుకూ విలియమ్సన్ దూరం

image

న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగే మూడో టెస్టుకూ దూరమయ్యారు. ఇప్పటికే గాయం వల్ల తొలి రెండు టెస్టులు ఆడలేకపోయిన కేన్ మూడో టెస్టుకూ అందుబాటులో ఉండటం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా కేన్ లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటికే భారత్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. నామమాత్రపు మ్యాచ్ NOV 1న ప్రారంభమవుతుంది.

Similar News

News November 5, 2025

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

News November 5, 2025

పంచాయతీ కార్యదర్శులపై కీలక నిర్ణయం

image

AP: గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్(GPDO)గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేతనాల్లో మార్పుల్లేకుండా ప్రస్తుతమున్న 5 కేడర్‌లను నాలుగుకు కుదించింది. ఇకపై 7,224 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పనిచేయనున్నాయి. 359 అర్బన్, 3,082 గ్రేడ్-1, 3,163 గ్రేడ్-2, 6,747 గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. అదే మాదిరిగా ఉద్యోగుల కేడర్‌ మారింది.

News November 5, 2025

నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

image

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.