News October 29, 2024

FLASH: మూడో టెస్టుకూ విలియమ్సన్ దూరం

image

న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగే మూడో టెస్టుకూ దూరమయ్యారు. ఇప్పటికే గాయం వల్ల తొలి రెండు టెస్టులు ఆడలేకపోయిన కేన్ మూడో టెస్టుకూ అందుబాటులో ఉండటం లేదు. అయితే బ్యాటింగ్ పరంగా కేన్ లేకపోవడం న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆ జట్టు ఇప్పటికే భారత్‌పై 2-0తో సిరీస్‌ను గెలుచుకుంది. నామమాత్రపు మ్యాచ్ NOV 1న ప్రారంభమవుతుంది.

Similar News

News November 5, 2024

‘ఈ నగరానికి ఏమైంది2’ వచ్చేస్తోంది!

image

సైలెంట్‌గా వచ్చి యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్‌‌ రాబోతోంది. త్వరలోనే ‘ఈ నగరానికి ఏమైంది2’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News November 5, 2024

పార్టీకి తక్కువ డబ్బిచ్చావన్నందుకు చంపేశాడు!

image

పార్టీ చేసుకున్నాక ఖర్చు షేర్ చేసుకోవడం కామన్. ఆ లెక్కల్లో తేడాలు వస్తే పెద్ద దుమారమే రేగుతుంది. MPలోని జబల్‌పూర్‌లో అదే జరిగింది. మనోజ్(26) తన మేనల్లుడు ధరమ్ ఠాకూర్(19) డియోరీ తపారియా అనే గ్రామంలో మందు, చికెన్‌తో పార్టీ చేసుకున్నారు. మందుకు ₹340, చికెన్‌కు ₹60 అయ్యింది. పార్టీ అయ్యాక ‘నువ్వు తక్కువ డబ్బు ఇచ్చావు’ అని మనోజ్ అనడంతో గొడవ మొదలైంది. కోపంతో ధరమ్ మేనమామ మనోజ్‌ను కర్రతో కొట్టి చంపాడు.

News November 5, 2024

నవంబర్ 5: చరిత్రలో ఈరోజు

image

* 1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
* 1920: ఇండియన్ ‘రెడ్‌క్రాస్’ ఏర్పడింది
* 1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
* 1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం
* 1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు(ఫొటోలో)
* 2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం