News March 31, 2024

విమానం ఒక రోజు ఆలస్యం.. ఎయిర్ ఇండియాకు రూ.85,000 ఫైన్

image

విమాన ఆలస్యంపై ఓ ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుపై ముంబై వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అతనికి రూ.85,000 పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు స్పష్టం చేసింది. 2018లో బ్యాంకాక్ నుంచి ముంబై బయలుదేరాల్సిన విమానం ఒక రోజు ఆలస్యమైంది. సంస్థ నిర్లక్ష్యానికి తాను మానసిక వేదనకు గురయ్యానని, ఒక వర్క్ డే‌ను కోల్పోయానని మోహిత్ నిగమ్(33) ఫిర్యాదు చేశారు. సుదీర్ఘంగా విచారించిన కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

Similar News

News November 7, 2024

మహిళలకు ప్రతినెలా రూ.3వేలు: రాహుల్ గాంధీ

image

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహా వికాస్ అఘాడీ (MVA) ఐదు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతోపాటు రైతులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ, నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు.

News November 7, 2024

చాహల్‌పై చిన్న చూపెందుకు?

image

టీమ్ఇండియా బౌలర్ చాహల్‌కు గడ్డుకాలం నడుస్తోంది. అవకాశం వచ్చిన ప్రతిసారి అదరగొట్టే చాహల్‌కు ప్రస్తుతం ఛాన్సులే రావట్లేదు. దీంతో IPLలో, Tటీ20ల్లో చాహల్ ప్రతిభను గుర్తించట్లేదని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. RCB,RR తరఫున చాహల్ (139, 66) అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టు నుంచి రిలీజ్ చేశారని మండిపడుతున్నారు. T20 క్రికెట్‌లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టినా జట్టులో చోటు ఇవ్వట్లేదంటున్నారు. మీ కామెంట్?

News November 7, 2024

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధిస్తూ చట్టం: AUS PM

image

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. సోషల్ మీడియా పిల్లలకు హాని చేస్తోందనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో చట్టం ప్రవేశపెడతామని, ఆమోదించిన 12 నెలల తర్వాత అమల్లోకి వస్తాయని తెలిపారు. మన దగ్గర ఇలాంటి చట్టం వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.