News April 2, 2024

HYD నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

image

అయోధ్యలోని బాల రాముడి దర్శనానికి వెళ్లే భక్తులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు నుంచి హైదరాబాద్-అయోధ్య మధ్య విమాన సర్వీస్‌ నడిపేలా స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. SG611 విమానం రోజూ HYD నుంచి 10.45 గంటలకు బయలుదేరి 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. రిటర్న్ ఫ్లైట్ SG616 అయోధ్య నుంచి 13.25 గంటలకు బయలుదేరి 15.25 గంటలకు HYDకి వస్తుంది.

Similar News

News February 14, 2026

ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

image

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.

News February 14, 2026

శివరాత్రి రోజున ఏం చేయాలంటే?

image

శివరాత్రి రోజున భక్తుల కార్యాలు జన్మజన్మల పాపాలను హరిస్తాయని పండితులు చెబుతున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన బిల్వదళాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ‘పంచామృత అభిషేకం విశేష ఫలితాలను ఇస్తుంది. భజనలు చేస్తూ, రాత్రంతా జాగరణ ఉంటూ, ఈశ్వర నామస్మరణలో గడిపితే అజ్ఞానం నశిస్తుంది. మనసా వాచా కర్మణా శివుడి ఆరాధన ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తుంది. ఇలా కైలాసనాథుని అనుగ్రహం లభిస్తుంది’ అని చెబుతున్నారు.

News February 14, 2026

వాలంటైన్స్ డే: మహీకాకు హార్దిక్ అదిరిపోయే గిఫ్ట్!

image

వాలంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్య తన కాబోయే భార్య మహీకా శర్మపై ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నారు. మొదట ‘M’ అనే అక్షరాన్ని మాత్రమే అనుకున్నా చివరికి రెండు చిరుతపులుల డిజైన్‌ను ఎంచుకున్నారు. ఒక చిరుత బలానికి చిహ్నంగా ఉంటే, రెండోది మహీకా అక్షరం ‘M’ రూపంలో ఆమె ఉనికిని సూచిస్తుంది. ఇద్దరూ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తమ రిలేషన్‌లో కలిసి ప్రయాణించాలన్నదే టాటూ అర్థం.