News September 12, 2024

వరద పరిహారం.. 15 వేల మంది ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తోంది. ఇల్లు డ్యామేజ్ అయితే రూ.16,500, గుడిసెలు కూలితే రూ.18,000 ఇస్తోంది. నిన్న 15వేల మంది ఖాతాల్లోకి రూ.25కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారికి ఇవాళ జమ అవుతాయని చెబుతున్నారు.

Similar News

News September 13, 2025

నేడు మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.

News September 13, 2025

ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

image

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.

News September 13, 2025

భారత్‌‌పై సుంకాలు విధించాలని G7, EUకి US రిక్వెస్ట్!

image

రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌, చైనాపై సుంకాలు విధించాలని G7 దేశాలు, EUను US కోరినట్లు రాయిటర్స్ తెలిపింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో దీనిపై చర్చ జరిగినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్‌ను వినియోగించుకుని, ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకూ అంగీకరించారని వెల్లడించింది.