News September 6, 2024
NTR జిల్లాలో వరద నష్టం రూ.1,000 కోట్లు!
AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు, రవాణా రంగానికి ₹35.50 కోట్లు, పర్యాటక రంగానికి ₹20 కోట్ల నష్టం జరిగింది. విజయవాడ డివిజన్‌లో రైల్వే శాఖ ₹30 కోట్ల ఆదాయం కోల్పోయింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
Similar News
News September 7, 2024
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వచ్చేసింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.
News September 7, 2024
BREAKING: మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం.. ఆరుగురి మృతి
మణిపుర్‌లో మళ్లీ విధ్వంసం చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో మైతేయి, కుకీ తెగల మధ్య మరోసారి వివాదం మొదలైంది. జిల్లాలోని నుంగ్‌సిప్పి, రషీద్‌పూర్ గ్రామాలలోని తేయాకు తోటల్లో ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇందులో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 7, 2024
ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 4, 4
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-B బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.