News August 23, 2024
త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
Similar News
News September 17, 2024
వారి ఖాతాల్లో ఏడాదికి రూ.12,000
TG: భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం(D) నాగులవంచలో దళిత బంధు 2వ విడత లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు.
News September 17, 2024
భారత ప్లేయర్లను ఉత్సాహపరచండి: ఆనంద్
చెస్ ఒలింపియాడ్-2024లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘మీరు Chess Olympiad 2024లో భారత్ ఏ స్థాయిలో ఉందో తప్పకుండా తెలుసుకోవాలి. రౌండ్ 6 తర్వాత ఓపెన్ & మహిళల విభాగాల్లో భారత్ ఆధిక్యంలో ఉంది. వారిని ఉత్సాహపరచండి. ప్రపంచంలోని టాప్-5లో ఇద్దరు భారత ప్లేయర్లు ఉండటం ఇదే తొలిసారి’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
నాక్కూడా CM కావాలనుంది: అజిత్ పవార్
CM పదవిపై NCP చీఫ్ అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఒక్కరూ తమ నాయకుడు CM కావాలని కోరుకుంటారు. నాకు కూడా ఆ కోరిక ఉంది. అయితే సీఎం అవ్వడానికి మెజారిటీ మార్క్ చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి కోరుకున్నది దక్కదు. అయితే, దానికోసం అంబేడ్కర్ ఓటు హక్కును కల్పించారు. అంతిమంగా అది ఓటర్ల చేతిలోనే ఉంది. 288 మంది ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ 145 మార్క్ చేరుకోవాలి’ అని పేర్కొన్నారు.