News June 11, 2024
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల నీరు ఉంది. మరికొద్ది రోజుల్లో జలాశయం పూర్తిస్థాయిలో నిండనుంది.
Similar News
News March 19, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. 21న తీర్పు

AP: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఐడీ నమోదు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి ఈ నెల 21కి తీర్పును వాయిదా వేశారు. ఈ కేసులో గుంటూరు జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సీఐడీ కేసులోనూ బెయిల్ వస్తే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.
News March 19, 2025
మమ్మల్ని కూటమి సర్కార్ అవమానిస్తోంది: బొత్స

AP: శాసనమండలిలో వైసీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. MLA, MLC క్రీడా పోటీల్లో కూడా తమపై వివక్ష చూపారని ఆయన మండిపడ్డారు. ‘నిన్న జరిగిన ఫొటో సెషన్‌లో నాకు కుర్చీ వేయలేదు. ఇతరులకు కేటాయించిన కుర్చీలో కూర్చోమన్నారు. క్రీడా పోటీల సందర్భంగా CM, స్పీకర్ ఫొటోలు మాత్రమే వేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఫొటో వేయలేదు’ అని ఫైర్ అయ్యారు.
News March 19, 2025
టీచర్ల బదిలీల చట్టంతో చరిత్ర సృష్టించబోతున్నాం: లోకేశ్

AP: ఏపీ ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ‘YCP ప్రభుత్వంలో అడ్డగోలుగా బదిలీలు జరిగాయి. అందరితో చర్చించాకే టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా ఉంటుంది. టీచర్ల బదిలీల చట్టం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది’ అని లోకేశ్ అన్నారు.