News July 19, 2024

SRSP, జూరాల ప్రాజెక్టులకు వరద

image

TG: రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు SRSP ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20వేలు, ఔట్ ఫ్లో 22,877 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీలుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం 24 అడుగులకు చేరింది.

Similar News

News December 1, 2024

సెక్స్ వర్కర్లకు పెన్షన్.. ఎక్కడో తెలుసా?

image

సెక్స్ వర్కర్లకు హక్కులు కల్పిస్తూ బెల్జియం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆ దేశంలోని సెక్స్‌వర్కర్లు పెన్షన్లు, అధికారిక ఉద్యోగ ఒప్పందాలు, ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, అనారోగ్య సెలవులు అందుకోనున్నారు. కరోనా సమయంలో సెక్స్ వర్కర్లకు ఆదాయం లేకపోవడంతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో 2022లోనే సెక్స్ వర్క్‌ను నేరరహితంగా గుర్తించింది. తాజాగా వారి కోసం చట్టం తెచ్చిన మొదటిదేశంగా నిలిచింది.

News December 1, 2024

నాగబాబు ట్వీట్.. ఎవర్ని ఉద్దేశించి?

image

జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట ఆసక్తిని రేపుతోంది. ‘నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే వెంటనే నీ దారిని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్కడి వాడివో అక్కడికి వెళ్లడం మరింత కష్టంగా మారుతుంది – స్వామి వివేకానంద’ అని పోస్ట్ చేశారు. ఆయన ఎవర్ని ఉద్దేశించి ఈ పోస్ట్ వేశారోనంటూ ట్వీట్ కింద కామెంట్లలో చర్చ నడుస్తోంది.

News December 1, 2024

ఉస్మా’నయా’ ఆస్పత్రిపై సీఎం సమీక్ష

image

TG: హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆస్పత్రిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రికి వెళ్లే రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్‌గా సీనియర్ అధికారి దాన కిషోర్‌ను నియమించారు.