News September 9, 2024
వందల కుటుంబాల్లో క’న్నీటి వరద’
TG: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు వందల కుటుంబాలను తీవ్ర దు:ఖంలో ముంచాయి. ఖమ్మం, పాలేరు, తిరుమలాయపాలెం, మహబూబాబాద్ ప్రాంతాల్లో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో కుండపోత వర్షాలు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. పెళ్లిళ్ల కోసం తెచ్చుకున్న సామగ్రి, కట్న కానుకలు, దుస్తులు, బియ్యం, ఇతర కిరాణా సామగ్రి, పట్టు చీరలు, నగలు, వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఒక్కొక్కరు రూ.లక్షల్లో నష్టపోయారు.
Similar News
News October 11, 2024
పిఠాపురంపై పవన్ ఫోకస్.. ప్రత్యేక బృందాల ఏర్పాటు
AP: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు 21 మంది జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 52 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారంపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.
News October 11, 2024
Hello నిద్రరావడం లేదు.. ఏం చేయమంటారు!
మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ టెలీ మానస్‌కు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ గురించే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. 2022 అక్టోబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు 3.5 లక్షల కాల్స్ వచ్చాయి. వీటిని విశ్లేషిస్తే నిద్రా భంగం 14%, మూడ్ బాగాలేకపోవడం 14%, స్ట్రెస్ 11%, యాంగ్జైటీ 9% టాప్4లో ఉన్నాయి. సూసైడ్ కాల్స్ 3% కన్నా తక్కువే రావడం గమనార్హం. హెల్ప్‌లైన్‌కు పురుషులు 56%, 18-45 వయస్కులు 72% కాల్ చేశారు.
News October 11, 2024
భార్య సూచన.. రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది
మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్‌కు ₹25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతోంది. అతను 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నారు. ఈ ఏడాదీ ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు(ఒక్కోటి ₹500) కొనుగోలు చేశారు. తర్వాత ఓ టికెట్‌ను స్నేహితునికి ఇవ్వాలనుకోగా భార్య అతడిని ఆపింది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. ఆ టికెట్‌కే ₹25 కోట్ల బహుమతి దక్కింది.