News February 9, 2025
ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.
Similar News
News March 25, 2026
మమత ముస్లింలకు ఏమీ చేయలేదు: ఒవైసీ

పశ్చిమ బెంగాల్ ముస్లింలకు సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేదని ఒవైసీ విమర్శించారు. ఆమె రాజకీయాలే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడ్డాయని.. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ముస్లిం నాయకత్వం లేని రాష్ట్రాల్లో వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. హుమాయున్ ఏజేయూ పార్టీతో కలిసి బెంగాల్‌లో ముస్లింల రాజకీయ నాయకత్వ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
News March 25, 2026
రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

పశ్చిమాసియాలో సంక్షోభంతో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్ కొనుగోలు చేశాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏకంగా 6 కోట్ల బ్యారెళ్ల చమురు APRలో డెలివరీ కానుందని పేర్కొంది. బ్రెంట్ ధరకు అదనంగా 5-15 డాలర్ల ప్రీమియం రేటుకు కొనుగోలు చేశాయని తెలిపింది. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఇతర దేశాలు సైతం భారీగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
*1 బ్యారెల్ అంటే 159 లీటర్లు.
News March 25, 2026
రాజధాని అమరావతిపై ఈ నెల 28న తీర్మానం

AP: ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.


