News February 9, 2025

ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

image

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.

Similar News

News February 11, 2026

VASTHU: స్మశానాలకు దగ్గర నివసించవచ్చా?

image

స్మశానాలకు దగ్గరగా నివసించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘స్మశానాల వద్ద జరిగే కార్యక్రమాలు నిరాశను, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అక్కడి గాలి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మనిషి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే నిలకడైన అభివృద్ధి కోసం ఇలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమం’. అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 11, 2026

చికెన్‌లో ఈ భాగాలు తినకండి

image

కోళ్ల లంగ్స్‌లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.

News February 11, 2026

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

image

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.