News May 11, 2024

అఫ్గానిస్థాన్‌లో వరదలు.. 200 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దిగువ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో బఘ్లాన్ ప్రావిన్సులో దాదాపు 200 మంది చనిపోయినట్లు యూనిటెడ్ నేషన్స్ తెలిపింది. వేల సంఖ్యలలో ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. దేశంలో చాలా చోట్ల మెరుపు వరదలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Similar News

News July 11, 2025

ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.

News July 11, 2025

శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

image

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT