News May 14, 2024
ఇండోనేషియాలో వరదలు.. 50 మంది మృతి

ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
Similar News
News March 27, 2026
NCLలో 12 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (NCL), పుణె.. కాంట్రాక్ట్ పద్ధతిలో 12 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. BE/B.Tech/MScతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 31.03.26 లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ తేదీ 09.04.26. మరిన్ని వివరాల కోసం www.ncl-india.org చూడండి.
News March 27, 2026
మేమూ యుద్ధంలోకి దిగుతాం: ఉగాండా

ఒకవేళ ఇజ్రాయెల్ ఓటమి అంచున ఉంటే తాము యుద్ధంలోకి దిగుతామని ఉగాండా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహూజీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై దాడికి తమ బ్రిగేడ్ సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ తమపై మిస్సైల్స్‌తో దాడి చేస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. 1980, 1990ల్లో తమ దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తమకు అండగా నిలిచిందని ముహూజీ గుర్తు చేసుకున్నారు.
News March 27, 2026
ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.


