News February 14, 2025
మహిళల భద్రతపై దృష్టిసారించండి: వైఎస్ జగన్

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>> ఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలికి అండగా ఉండాలని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని Xలో మండిపడ్డారు. ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని కోరారు.
Similar News
News March 16, 2025
అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (1/2)

ప్రత్యేక రాష్ట్రమంటూ లేనప్పుడు తెలుగువారికి అన్నివైపులా అవమానాలే జరిగేవి. అది భరించలేకపోయిన పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించారు. మద్రాసు CM రాజాజీ వార్నింగ్ కారణంగా తెలుగు కాంగ్రెస్ వారెవరూ మద్దతుగా రాలేదు. ఒంటరైనా, పేగులు పుళ్లు పడి పురుగులు పట్టి అనుక్షణం నరకాన్ని చూస్తున్నా దీక్షను మాత్రం శ్రీరాములు ఆపలేదు. చివరికి 1952, డిసెంబరు 15న అమరుడయ్యారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.