News January 25, 2025
పొగమంచు వల్లే స్పిన్ ఆడటం కష్టమైంది: బ్రూక్

కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ENG బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో తడబడ్డారు. దీనికి పొగమంచే కారణమని ఆ జట్టు VC బ్రూక్ తెలిపారు. ‘చక్రవర్తి చాలా మంచి బౌలర్. పొగ మంచు వల్ల అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం మరింత కష్టమైంది. చెన్నైలో అలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నా. T20 క్రికెట్లో అత్యంత కష్టతరమైనది స్పిన్ బౌలింగ్‌ను ఆడటమే. నేను మిడిలార్డర్లో వస్తాను కాబట్టి తొలి బంతి నుంచే స్పిన్‌ను ఆడాలి’ అని చెప్పారు.
Similar News
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.
News January 17, 2026
బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
News January 17, 2026
100 దేశాలకు కార్ల ఎగుమతి.. మారుతీ సుజుకీ ప్లాన్

తమ విక్టోరిస్ మోడల్ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. విక్టోరిస్‌ను అక్రాస్ పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తామని చెప్పింది. 450 కార్ల తొలి బ్యాచ్‌ను తరలించామని వెల్లడించింది. 2025లో 3.9 లక్షల కార్లను ఎగుమతి చేశామని సంస్థ సీఈవో హిసాషి టకేయుచి తెలిపారు. విక్టోరిస్ ధర రూ.10.50 లక్షలు-రూ.19.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.


