News June 18, 2024
ఆహార ద్రవ్యోల్బణమే దెబ్బకొడుతోంది: RBI గవర్నర్

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నా ఆహార ధరలు పెరుగుతుండటంతో అది సవాల్‌గా మారుతోందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. సప్లైకు కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం ధరలపై కనిపిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ద్రవ్యోల్బణ కట్టడి సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. గత ఏడు నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం సగటు 8%గా ఉందని తెలిపారు. కాగా ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 4.75%గా ఉంది.
Similar News
News March 30, 2026
చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

ఏప్రిల్ 1 నుంచి హిక్‌విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్‌సెట్‌లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.
News March 30, 2026
సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 30, 2026
జనగణన.. సహజీవన జంటలకు కుటుంబ హోదా

దేశంలో ఎల్లుండి నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో జనగణన సాగనుంది.


