News August 19, 2024
ఫుడ్‌పాయిజన్ ఘటన.. సీఎం కీలక ఆదేశాలు

AP: అనకాపల్లి హాస్టల్‌లో ఫుడ్‌పాయిజన్ <<13890531>>ఘటన<<>> నేపథ్యంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థలను తనిఖీ చేయాలని సూచించారు. వాటికి అనుమతులు ఉన్నాయా? సొంత భవనాలేనా? పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంది? తదితర అంశాలను చెక్ చేయాలని చెప్పారు. కాగా కలుషిత ఆహారం తిన్న ఘటనలో ఇప్పటికే నలుగురు పిల్లలు మృత్యువాత పడ్డారు.
Similar News
News November 7, 2025
లెస్బియన్ అఫైర్.. 6 నెలల బిడ్డను చంపిన తల్లి?

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
News November 7, 2025
న్యూస్ అప్‌డేట్స్ @10AM

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం
News November 7, 2025
నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.


