News December 17, 2024

మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్

image

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. తృణధాన్యాల ద్వారా మెదడు ఇతర శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నట్స్&సీడ్స్‌లో విటమిన్-E అధికంగా ఉండి మెదడు సంబంధిత వ్యాధులతో వచ్చే మరణాలను తగ్గిస్తుంది. అవకాడో తింటే మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ తింటే ఏకాగ్రత మెరుగవుతుంది. బ్లూ బెర్రీస్ వల్ల డిమెన్షియా లక్షణాలు తగ్గి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది.

Similar News

News November 20, 2025

ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్‌మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్‌లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్‌ సౌత్ ప్రాగ్‌కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.

News November 20, 2025

తిరుమలలో గంటల శబ్దం వచ్చేది ఇక్కడి నుంచే..

image

తిరుమల వేంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటల శబ్దాలు వినిపిస్తుంటాయి. ఆ గంటలున్న మండపాన్ని తిరుమామణి అని అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు గంటలు ఉంటాయి. మొదటిది నారాయణ గంట. రెండవది గోవింద గంట. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ మండపాన్ని సామాన్య శకం 1417వ సంవత్సరంలో మాధవదాసు అనే భక్తుడు నిర్మించాడు. స్వామివారి నివేదన వేళ ఆయన్ను స్మరించుకోవడానికి ఈ మండపం ఒక ముఖ్యమైన భాగం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 20, 2025

చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

image

TG: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.