News December 17, 2024
మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్స్
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. తృణధాన్యాల ద్వారా మెదడు ఇతర శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. నట్స్&సీడ్స్‌లో విటమిన్-E అధికంగా ఉండి మెదడు సంబంధిత వ్యాధులతో వచ్చే మరణాలను తగ్గిస్తుంది. అవకాడో తింటే మెదడుకు రక్తప్రసరణ పెరుగుతుంది. డార్క్ చాక్లెట్ తింటే ఏకాగ్రత మెరుగవుతుంది. బ్లూ బెర్రీస్ వల్ల డిమెన్షియా లక్షణాలు తగ్గి అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుంది.
Similar News
News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
News January 22, 2025
ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త
తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 22, 2025
ఫిబ్రవరి 5న మహా కుంభమేళాకు ప్రధాని మోదీ!
UPలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు PM మోదీ FEB 5న వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్‌రాజ్ చేరుకొని త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.