News March 5, 2025
తల్లికిచ్చిన మాట కోసం 26 ఏళ్లుగా!

అనారోగ్యంతో చనిపోయిన తన తల్లికిచ్చిన వాగ్దానం మేరకు డా.నాగేంద్ర శర్మ (రాజస్థాన్) 26 ఏళ్లుగా ఉచితంగా మూర్ఛ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యం చేయించుకోలేక చనిపోయిన తన తల్లిలా మరెవరికీ జరగకూడదని నిర్ణయించుకున్నారు. ఈయన 1987లో వైద్య విద్య పూర్తి చేశారు. మూఢ నమ్మకాలతో మూర్ఛ రోగులు చనిపోకూడదని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లుగా 80వేల మందికి పునర్జన్మనిచ్చిన శర్మను అభినందించాల్సిందే.
Similar News
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News March 22, 2025
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

AP: ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
News March 22, 2025
బీఆర్ఎస్ DNAలోనే అవినీతి ఉంది: మంత్రి సీతక్క

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమాన్ని చూసి BRS ప్రభుత్వం ఓర్వలేకపోతోందని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాలకు మారుపేరని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర పరువు తీసిందని, ఆపార్టీ DNAలోనే అవినీతి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ DNAలోనే అవినీతి ఉందని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి ఇలా కౌంటరిచ్చారు.