News July 31, 2024
‘మహారాజ’ కోసం విజయ్ ఒక్కరూపాయి తీసుకోలేదట!

స్టార్ హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ కాంబోలో తెరకెక్కిన ‘మహారాజ’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం సేతుపతి ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని సినీ వర్గాలు తెలిపాయి. రూ.20 కోట్ల పరిమిత బడ్జెట్ ఉండటంతో రెమ్యునరేషన్ వద్దని ఆయన మేకర్స్‌కు చెప్పారట. అయితే సినిమా విజయం సాధించడంతో లాభాల్లో షేర్ పొందే అవకాశం ఉంది.
Similar News
News November 19, 2025
ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు: డీఈఓ సత్యనారాయణ

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నెలలో కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. నవంబర్ 21, 22న ప్రాథమిక పాఠశాల, 24, 25న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఉపాధ్యాయులు రెండు రోజులు విడివిడిగా తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ స్పష్టం చేశారు.
News November 19, 2025
ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 19, 2025
చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్‌కు అర్హత!

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.


