News May 10, 2024

చరిత్రలో తొలిసారి.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో జాతీయ పార్టీ పేరు!

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇవాళ ED సుప్రీంకోర్టుకు సమర్పించనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చనుంది. దీంతో చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును ED నిందితుల జాబితాలో చేర్చినట్లు కానుంది. ఫలితంగా ఆపార్టీ ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు కాసేపట్లో సుప్రీంలో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారణ ప్రారంభం కానుంది.

Similar News

News February 14, 2025

ఆటవిక పాలనలోనే దాడులు, హత్యలు: సీఎం

image

AP: నేరస్థులు రాజకీయాల్లో ఉంటే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అని CM చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని చంపి ఇప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించాలనేది వారి తాపత్రయమన్నారు. ఆటవిక పాలనలోనే దాడులు, విధ్వంసాలు, హత్యలు జరుగుతాయని తెలిపారు. తాము ప్రజాస్వామ్యవాదులమని, చట్టబద్ధంగా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.

News February 14, 2025

నీ సంకల్పం గొప్పది బ్రో..!

image

సివిల్ సర్వెంట్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే. కొందరు నాలుగైదు అటెంప్ట్స్‌లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్ అయిపోతుంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీవాస్తవ(48) ఇప్పటివరకు UPSC, MPPSC కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం పొందలేకపోయారు. ప్రతిసారి నిరాశే ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించారు.

News February 14, 2025

కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

image

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ FEB 18న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త CEC ఎంపిక కోసం PM మోదీ, లా మినిస్టర్ అర్జున్ మేఘ్‌వాల్, LOP రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. 480 మంది నుంచి సెర్చ్ కమిటీ ఐదుగురిని షార్ట్ లిస్టు చేయనుంది. ఈ జాబితాలో 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ జ్ఞానేశ్ కుమార్ ముందువరుసలో ఉన్నారు. ఈయన గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు.

error: Content is protected !!