News May 13, 2024
‘370’ రద్దు తర్వాత శ్రీనగర్‌లో తొలిసారిగా..!
జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారిగా శ్రీనగర్‌లో ఈ నెల 25న లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అగా రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి వహీద్ ఉర్ రెహమాన్‌కు మధ్య మాత్రమే పోటీ నెలకొంది. స్థానికులు 3 దశాబ్దాల్లో తొలిసారిగా హింసాత్మక బెదిరింపులకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటం విశేషం.
Similar News
News January 9, 2025
సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్
TG: PAC సమావేశంలో మంత్రులకు AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. CMను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మంత్రులెందుకు స్పందించడంలేదని నిలదీశారని తెలుస్తోంది. తాను స్పందిస్తున్నానని ఓ మంత్రి చెప్పగా, ఎవరేం చేస్తున్నారో తనకంతా తెలుసని అన్నారు. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించినట్లు సమాచారం.
News January 9, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ని రేపు(జనవరి 10) విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్ డిజైన్ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. కాగా నిన్న గ్రూప్-3 <<15099005>>‘కీ’ని<<>> టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే.
News January 9, 2025
పెను విషాదం: తిరుపతి తొక్కిసలాటకు కారణమిదే..
వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పద్మావతి పార్క్‌లో ఉంచారు. అప్పుడే ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సిబ్బంది గేటు తెరిచారు. టోకెన్లు ఇచ్చేందుకే గేటు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అలాగే క్యూలైన్ల వద్ద సిబ్బంది ఓవరాక్షన్ కూడా తొక్కిసలాటకు కారణమని మరికొందరు భక్తులు మండిపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.