News November 7, 2024
పదేళ్లలో తొలిసారి.. టాప్-20 నుంచి కోహ్లీ ఔట్

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయారు. ఇలా కోహ్లీ టాప్20 నుంచి పడిపోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన టెస్టుల్లో 2 సార్లు అగ్రస్థానానికి ఎగబాకారు. 2011లో 116, 2012లో 37, 2013లో 11, 2014 &15లో 15, 2016 &17లో 2, 2018 &19లో 1వ ర్యాంకు, 2020లో 2, 2021లో 9, 2022లో 15, 2023లో 9, ఈ ఏడాది 22వ స్థానానికి చేరుకున్నారు.
Similar News
News December 1, 2025
పదేళ్లలో రెట్టింపైన విదేశీ అప్పు: లోక్సభ

మన దేశ అప్పు ఊహించని విధంగా పెరుగుతూ పోతోంది. గత పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ, అప్పులపై లోక్సభలో వెల్లడించిన లెక్కలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. RBI ప్రకారం భారత విదేశీ రుణం దాదాపు రెట్టింపు అయ్యింది. 2015లో దేశ విదేశీ అప్పు రూ. 29,71,542 కోట్లుగా ఉంటే, 2025 జూన్ నాటికి అది రూ. 63,94,246 కోట్లకు చేరింది. అప్పులు పెరిగితే నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యుడి జీవన వ్యయం భారమవనుంది.
News December 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 83 సమాధానాలు

నేటి ప్రశ్న: శివారాధనకు సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అందుకు కారణమేంటి?
సమాధానం: సోమవారానికి సోముడు అధిపతి. సోముడంటే చంద్రుడే. ఆ చంద్రుడిని శివుడు తన తలపై ధరిస్తాడు. అలా సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైనదిగా మారింది. జ్యోతిషం ప్రకారం.. సోమవారం రోజున శివుడిని పూజిస్తే చంద్రుడి ద్వారా కలిగే దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత, అదృష్టం లభిస్తాయని నమ్మకం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 1, 2025
వ్యవసాయం కుదేలవుతుంటే చోద్యం చూస్తున్న CBN: జగన్

AP: వ్యవసాయం కుప్పకూలిపోతుంటే CM CBN రైతులను వారి విధికి వదిలేసి చోద్యం చూస్తున్నారని YCP చీఫ్ YS జగన్ మండిపడ్డారు. ‘హలో ఇండియా! AP వైపు చూడండి. అక్కడ KG అరటి ₹0.50 మాత్రమే. ఇది నిజం. రైతుల దుస్థితికిది నిదర్శనం. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. మా హయాంలో టన్ను అరటికి 25వేలు ఇచ్చాం. రైతులు నష్టపోకుండా ఢిల్లీకి రైళ్లు ఏర్పాటుచేశాం. కోల్డ్ స్టోరేజీలు పెట్టాం’ అని Xలో పేర్కొన్నారు.


