News November 7, 2024

పదేళ్లలో తొలిసారి.. టాప్-20 నుంచి కోహ్లీ ఔట్

image

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయారు. ఇలా కోహ్లీ టాప్20 నుంచి పడిపోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన టెస్టుల్లో 2 సార్లు అగ్రస్థానానికి ఎగబాకారు. 2011లో 116, 2012లో 37, 2013లో 11, 2014 &15లో 15, 2016 &17లో 2, 2018 &19లో 1వ ర్యాంకు, 2020లో 2, 2021లో 9, 2022లో 15, 2023లో 9, ఈ ఏడాది 22వ స్థానానికి చేరుకున్నారు.

Similar News

News December 7, 2024

పుష్కలంగా టీబీ మందులు: కేంద్ర ఆరోగ్య శాఖ

image

దేశంలో క్షయ వ్యాధి(TB) నిరోధక ఔషధాల కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. DEC6 నాటికి అన్ని కేంద్రాల్లో 2 నెలలకు పైగా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపింది. మందులను సకాలంలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకున్నామంది. కాగా TB కేసుల్లో దేశం టాప్‌లో ఉంది. 21.69లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. TB కట్టడే లక్ష్యంగా 347 హైఫోకస్ జిల్లాల్లో 100 రోజుల ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

News December 7, 2024

ఆటోల బంద్‌పై వెనక్కి తగ్గిన JAC

image

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన JAC దానిని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన వెంటనే తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ గిరాకీ పోయి, ఉపాధి దెబ్బతిందని JAC నేతలు తొలుత ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు చెల్లించాలని కోరుతున్నారు.

News December 7, 2024

సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. ఆప్షనల్ హాలిడేస్‌లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే, నవంబర్ తప్ప 10 నెలల్లో సెలవులు ఉన్నాయి.