News March 16, 2024

తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖలీల్

image

నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఖలీల్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Similar News

News March 4, 2026

ఆనం కుమారుల సైలెంట్‌కు కారణం ఏంటి?

image

నెల్లూరు రాజకీయం అంటే ముందుగా గుర్తు వచ్చేది అనం కుటుంబం. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండు దశాబ్దాల పాటు నెల్లూరులో తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డారు. అయితే ఆయన మరణాంతరం కుమారులు ఆనం రంగ మయూర్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డిలు సైలెంట్‌గా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారని ఆనం కుటుంబం అభిమానులు చెబుతున్నారు. వీరి రాజకీయ ఎంట్రీ ఏ పార్టీల నుంచి అనే దానిపై చర్చ సాగుతోంది.

News March 4, 2026

నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

image

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.