News March 16, 2024
తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖలీల్
నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఆయనను నెల్లూరు సిటీ అభ్యర్థిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. నెల్లూరు నగరంలోని అతి సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటికే నెల్లూరులో ఖలీల్ అహ్మద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Similar News
News October 4, 2024
వెంకటగిరి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురానికి చెందిన నర్సింహులకు సైదాపురం మండలం దేవర వేమూరుకు చెందిన శైలజ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. కొద్ది రోజులకు ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఎస్ఐ సుబ్బారావు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను ఇళ్లకు పంపించారు.
News October 4, 2024
NLR: బాలికపై లైంగిక దాడికి యత్నం
బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 4, 2024
సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్
నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.