News September 13, 2024
భారత్‌లో మళ్లీ ఉత్పత్తి ప్రారంభించనున్న ఫోర్డ్
కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ 1995 నుంచి భారత్‌లోని చెన్నై, గుజరాత్‌లో కార్లను తయారుచేసేది. అమ్మకాలు పడిపోవడంతో 2021 సెప్టెంబరులో ఉత్పత్తి ఆపేసింది. అయితే ఇప్పుడు చెన్నైలో మళ్లీ ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపింది. మరి భారత మార్కెట్ కోసం కూడా కార్లను ఉత్పత్తి చేస్తుందా లేదా అన్నదానిపై సంస్థ స్పష్టతనివ్వలేదు.
Similar News
News October 15, 2024
నేటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు నేటి నుంచి బంద్ పాటిస్తున్నాయి. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలలు నడపలేకపోతున్నామని డిగ్రీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తెలిపింది. ఉద్యోగుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నట్లు పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.
News October 15, 2024
‘i-Pill అంటోంది I miss you’.. వివాదం రేపిన జెప్టో నోటిఫికేషన్
డిజిటల్ మార్కెటింగ్‌లో క్యాచీ హెడ్‌లైన్స్, ట్యాగ్స్ భలే అనిపిస్తాయి. పదాల అర్థం, పద్ధతులపై అవగాహన లేకుంటే మిస్‌ఫైర్ అవుతాయి. వర్క్ ప్లేస్‌లో సెక్సువల్ హరాస్‌మెంట్‌పై పోరాడే బెంగళూరు లాయర్‌కు ‘ఐ పిల్ గర్భనిరోధక మాత్ర అంటోంది, ఐ మిస్ యూ పల్లవి’ అంటూ జెప్టో పంపిన మెసేజ్ పెద్ద వివాదానికే దారితీసింది. అంటే నన్నిప్పుడు దీన్ని తీసుకోమంటారా అని LinkedInలో ఆమె లాంగ్ పోస్ట్ పెట్టడంతో జెప్టో సారీ చెప్పింది.
News October 15, 2024
BJP, RSS ప్రొఫెసర్ సాయిబాబాను వేధించాయి: దిగ్విజయ్ సింగ్
ప్రొఫెసర్ సాయిబాబా మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘దివ్యాంగుడైన DU ప్రొఫెసర్‌ను BJP, RSS తప్పుడు ఆరోపణలతో జైలుకి పంపి వేధించాయి. అర్బన్ నక్సల్ అంటూ కేసు పెట్టి పదేళ్లు జైల్లో ఉంచారు. చివరకు హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇప్పటికైనా ఆయన సర్వీసులో వచ్చే జీతం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని అమిత్ షాకు ఫోన్ చేసి అభ్యర్థించా’ అని తెలిపారు.