News November 25, 2024
విదేశీ మారకం: RBI Gold Strategy
FIIల డిజిన్వెస్ట్‌మెంట్‌తో తరుగుతున్న విదేశీ మారక నిల్వల సమతుల్యం కోసం RBI భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. ఇటీవల 44.76 టన్నుల గోల్డ్ కొనడం ద్వారా నిల్వలు 866 టన్నులకు చేరుకున్నాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య విదేశీ కరెన్సీ ఆస్తులు $1.1 బిలియన్ల మేర తగ్గినప్పటికీ, బంగారం నిల్వల విలువ $13 బిలియన్ల మేర పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం $658 బిలియన్లుగా ఉన్నాయి.
Similar News
News December 8, 2024
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అక్కడి పార్టీలు జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధ్యక్షుడి సైనిక పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన్ను తొలగించేందుకు అధికార పీపుల్స్ పవర్ పార్టీ (PPP), విపక్ష డెమోక్రటిక్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే శనివారం ఓటింగ్ సందర్భంగా PPP సభ్యులు అనూహ్యంగా బాయ్‌కాట్ చేయడంతో తీర్మానం వీగిపోయింది.
News December 7, 2024
అర్ధరాత్రి వరకు నిద్ర పోవట్లేదా?
రాత్రి సమయంలో లేటుగా పడుకొని ఉదయాన్నే నిద్ర లేచేందుకు ఇబ్బందులు పడేవారిలో గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ సర్వేలో తేలింది. త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచే వారితో పోలిస్తే అర్ధరాత్రి ఆలస్యంగా నిద్రించే వారికి డయాబెటిస్ రిస్క్ ఎక్కువని పేర్కొంది. అర్ధరాత్రి వరకు మేల్కొనే వాళ్లు వీకెండ్ నిద్రతో ఆ లోటును భర్తీ చేయాలనుకోవడం ఆరోగ్య సమస్యలకు కారణమని అధ్యయనాల్లో తేలింది.
News December 7, 2024
ఈనెల 15న WPL మినీ వేలం
బెంగళూరులో ఈనెల 15న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. మొత్తం 120 మంది ప్లేయర్లు ఆక్షన్‌లో పాల్గొంటున్నారని, అందులో 29 మంది విదేశీ ప్లేయర్లున్నారని తెలిపింది. స్వదేశీ క్రికెటర్ల కోసం 19 స్లాట్లు, ఓవర్సీస్ ప్లేయర్లకు 5 స్లాట్లు కేటాయించినట్లు పేర్కొంది. WPLలో మొత్తం 5 జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.