News January 27, 2025
విదేశీ గంజాయి కలకలం.. అమెరికా నుంచి హైదరాబాద్‌కు..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అమెరికా నుంచి తెచ్చిన 170 గ్రాముల విదేశీ గంజాయిని గచ్చిబౌలిలో పోలీసులు సీజ్ చేశారు. దీన్ని సరఫరా చేస్తున్న శివరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబయ్ పరారీలో ఉన్నాడు. అమెరికా నుంచి గంజాయిని తెచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News February 16, 2025
చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
News February 16, 2025
కొత్త హీరోయిన్‌తో లవ్‌లో పడ్డ రామ్ పోతినేని?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన RAPO22తో బిజీగా ఉండగా ఆ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. లవ్ స్టోరీలో నటిస్తూ ఈ బ్యూటీతో ప్రేమలో పడిపోయాడని పేర్కొన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ హీరోయిన్ అనుపమతో రామ్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News February 16, 2025
సంచలనం: ఇండియా ఎన్నికల్లో అమెరికా జోక్యం!

అమెరికాలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని DOGE శాఖ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇండియాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల ట్యాక్స్ పేయర్ల డబ్బును వెచ్చించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు ఇతర దేశాలకూ ప్రపోజ్ చేసిన నిధులను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. అయితే మన దేశ ఎన్నికల్లో విదేశీ జోక్యం బయటపడటంతో దీనిపై మోదీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.