News February 10, 2025

6 నెలల్లో అటవీశాఖలో పోస్టుల భర్తీ

image

AP: అటవీ శాఖలోని ఖాళీలను వచ్చే 6 నెలల్లో భర్తీ చేయనున్నామని ఆ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి తెలిపారు. APPSC ద్వారా రేంజి, సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో 50చోట్ల రూ.50కోట్లతో ఎకో టూరిజం డెవలప్ చేసి 4వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అటవీ శాఖ పట్టుకున్న 905MT ఎర్రచందనాన్ని త్వరలో విక్రయిస్తామని, రూ.350cr ఆదాయం వస్తుందని వివరించారు.

Similar News

News November 22, 2025

వంటింటి చిట్కాలు

image

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
– ఫ్రిజ్‌లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్‌‌‌లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.

News November 22, 2025

క్షమాపణలు చెప్పిన అల్‌-ఫలాహ్‌ వర్సిటీ

image

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్‌-ఫలాహ్‌ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్‌సైట్‌లో ఉన్న పాత అక్రిడిటేషన్‌ వివరాలపై NAAC షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్‌సైట్ డిజైన్‌ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్‌లను తమ సైట్‌లో కొనసాగిస్తూ వచ్చింది.