News December 6, 2024

బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

image

AP: కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. దీనికి వినీత్ బ్రిజ్ లాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. బియ్యం అక్రమ రవాణాపై నమోదైన కేసులన్నింటినీ సిట్ విచారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు విచారణలో పురోగతిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్‌కు అవసరమైన సమాచారం ఇవ్వాలని డీజీపీ, హోం సెక్రటరీకి సీఎస్ నీరబ్ సూచించారు.

Similar News

News April 2, 2026

ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ ఆక్టోపస్‌కి కేటాయింపు

image

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరిధిలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌ను OCTOPUS విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. 45 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ రేంజ్ గత ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు ఇక్కడ శిక్షణ పొందుతుండగా, ఇప్పటివరకు తాడేపల్లి వడ్డేశ్వరం వద్ద ప్రైవేట్ భవనంలో OCTOPUS విభాగం ఉంది.

News April 2, 2026

రాముడి లుక్‌కు ఫిదా.. VFXపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు!

image

నితేశ్ తివారీ ‘రామాయణ’ <<19543549>>టీజర్‌పై<<>> SMలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’ కంటే బెటర్ అని కొందరు.. అంతా ఏఐ వీడియోలా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో VFX క్వాలిటీ, గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

News April 2, 2026

ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ భేటీ

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం నేపథ్యంలో ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. PMను మంగళగిరి శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను లోకేశ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.