News March 24, 2024
బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ RKS బధౌరియా బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘నాలుగు దశాబ్దాలుగా ఎయిర్‌ఫోర్స్‌లో సేవ చేశాను. కానీ మోదీ లీడర్‌షిప్‌లో గడిచిన ఎనిమిదేళ్లు నా సర్వీస్‌లో ఉత్తమం. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు సాయుధ బలగాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయి’ అని బధౌరియా అన్నారు.
Similar News
News November 6, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి బడ్జెట్, నూతన క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీలు, ప్రభుత్య ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపుదలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు.
News November 6, 2024
OFFICIAL: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి
బాలీవుడ్ ‘రామాయణ’ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళికి మొదటి, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. నితేశ్ తివారీ రూపొందించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, యశ్ కీలకపాత్రలు పోషిస్తారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.
News November 6, 2024
US ELECTIONS: ఇండియన్ అమెరికన్స్ హవా
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా కొనసాగుతోంది. వర్జీనియా నుంచే కాకుండా మొత్తం ఈస్ట్ కోస్ట్‌లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎంపికైన సుహాస్ సుబ్రహ్మణ్యం చరిత్ర సృష్టించారు. ఐదుగురు ఇండియన్ అమెరికన్స్ ఉండే కాంగ్రెస్ సమోసా కాకస్‌లో చోటు దక్కించుకున్నారు. మిచిగన్ నుంచి శ్రీ తానేదార్ రెండోసారి, ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి విజయఢంకా మోగించారు. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది.