News June 1, 2024
మాజీ సీఎం ఓడిపోతారు: ఆరా మస్తాన్
ఉమ్మడి ఏపీ మాజీ CM కిరణ్ కుమార్‌రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోతారని ఆరా మస్తాన్ వెల్లడించారు. నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురందీశ్వరి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన BJP నేత సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్(BJP) గెలుస్తారని అంచనా వేశారు.
Similar News
News September 8, 2024
రేపు 400 గ్రామాలకు రూ.లక్ష చొప్పున విరాళం: నాదెండ్ల
AP: వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు ₹లక్ష చొప్పున రేపు విరాళం అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పంచాయతీలను ఆదుకునేందుకు dy.cm పవన్ సొంత నిధుల నుంచి ₹4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని సూచించారు.
News September 8, 2024
వినాయక చవితి వేడుకల్లో బంగ్లాదేశ్ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో తన నివాసంలో గణేషుడి ప్రతిమకు పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ‘గణపతి బొప్ప మోరియా’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దాస్ సెంచరీతో ఆకట్టుకున్నారు.
News September 8, 2024
రాష్ట్రంలో వరద నష్టం ప్రాథమిక అంచనా ఇదే..
AP: రాష్ట్రంలో వరదల వల్ల రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అత్యధికంగా R&B రూ.2164.5 కోట్లు, నీటివనరులు రూ.1568.5 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1160 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. రెవెన్యూశాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖ రూ.481 కోట్లు, వ్యవసాయం రూ.301 కోట్లు, పంచాయతీ రోడ్ల విభాగం రూ.167.5 కోట్లు, మత్స్య శాఖకు రూ.157.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.